calender_icon.png 7 April, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్జీవన్ రామ్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

06-04-2025 12:04:46 AM

మలక్‌పేట, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : సామాజిక సమానత్వం, అస్పృశ్యత నిర్మూలన కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని ముసరాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం  బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఉన్న వారి విగ్రహానికి కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి  బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ, సుభాష్ చందర్జీ, గౌర దేవేందర్, సందడి సురేందర్ రెడ్డి, రమేష్‌రెడ్డి, యాదగిరి, సురేందర్,  ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని బీఆర్‌ఎస్ నేతలు బాబు సుదర్శన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మలక్‌పేట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మందడి విజయసింహారెడ్డి బాబు జగ్జీవన్రామ్ గ్రహానికి పూలమాల వేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బద్దం సురేందర్ రెడ్డి, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలోబాబు జగ్జీవన్ రామ్ విగ్రహా నికి దళిత సంఘాల నేతలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. బట్టు దాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.