05-04-2025 05:54:55 PM
సత్తుపల్లి (విజయక్రాంతి): మెయిన్ రోడ్ బస్ స్టాండ్ వద్ద భారతదేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రాం 118వ జయంతి సందర్బంగా మహనీయుడికి సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, మాజీ వైస్ చైర్మన్ సుజాల రాణి, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, కామల్ పాషా, సత్తుపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు పాల్గొన్నారు.