మహిళా కాంగ్రెస్ కరీంనగర్, జగిత్యాల జిల్లా ఇంచార్జి సుగుణ
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి): సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ర్టం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో జగిత్యాల జిల్లా ను రాష్ర్టంలోనే ముందు వరుసలో నిలపా లని కరీంనగర్, జగిత్యాల జిల్లాల మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ సుగుణ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడు తూ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురా లు ఆల్క లంబా, రాష్ర్ట అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు గత సెప్టెం బర్ 15 మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స వం రోజు నుండి సభ్యత్వం నమోదు ప్రక్రి య ప్రారంభమై కొనసాగుతుందని తెలిపా రు.
మహిళ కాంగ్రెస్ లో జిల్లా విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరు సభ్య త్వం నమోదు చేయించాలని కోరారు. అనం తరం ఇంచార్జి సుగుణ మాట్లాడుతూ జగి త్యాల జిల్లాకు రావడం సంతోషంగా ఉంద న్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెయ్యడా నికి సెప్టెంబర్ 15 న మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళా నాయకురాలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
సభ్యత్వం నమోదు ప్రక్రి యలో తెలంగాణ రాష్ర్టం దేశానికి ఆదర్శం గా నిలిచిందని, జగిత్యాల జిల్లాను సైతం రాష్ర్టం లో ముందు నిలిపేలా ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాల న్నారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేయని మహిళా కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు.
రానున్న రోజుల్లో వచ్చే ఎన్నిక లలో అవకాశం వస్తే ప్రతి మహిళా పోరాడా లని, విజయం సాధించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా అధ్యక్షు రాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కి సహకరి స్తు, సభ్యత్వ నమోదును పెంచాలని సూచిం చారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అ ర్థం అయ్యేలా వివరించాలని కోరారు. ఈ స మావేశంలో పిప్పరి అనిత, నాగలక్ష్మి, సోగ్రా భి, బింగి సుమ, మమత , విజయలక్ష్మి, కరు ణశ్రీ, మంజుల, మ్యాదరి లక్ష్మి, లత, పద్మ, జయశ్రీ, రూప, హరిత రూబిన వివిధ హో దాలో ఉన్న మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.