calender_icon.png 26 December, 2024 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాలను ఆదర్శంగా నిలపాలి

25-12-2024 12:00:00 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 24: పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీని రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి-లక్ష్మన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పారిశుధ్యం, అభివృద్ధి విషయంలో జగిత్యాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

అనంతరం నూతనంగా నియామకం అయిన వార్డు అధికారులు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్‌ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అంద జేయగా శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి,కమిషనర్ చిరంజీవి,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్‌లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.