కరీంనగర్ (విజయక్రాంతి): ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జగిత్యాల ఎస్పీ అశోక్కూమార్ పరిశీలించారు. ఆర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసుశాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.