- నేను ఎవరిపైనా దాడి చేయలేదు..
- ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): ‘కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కూమార్ నాపై దాడి చేశారు. నేను ఆయనపై దాడి చేయలేదు’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపిం చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం కోరుట్ల డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. తాను ఎవరి పైనా దాడి చేయలేదని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్
కరీంనగర్,జనవరి 15 (విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా ఆయన్ను అడ్డుకుని, దాడికి పాల్పడ్డారని నమోదైన కేసుల్లో అరెస్టయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం కరీంనగర్ రెండో అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
మరో కేసులో నోటీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (విజయక్రాంతి): బాంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ విధులను అడ్డుకున్న కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విచారణకు హాజరు కావాలని బుధవారం మాసబ్ ట్యాంక్ పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. అయితే.. గురువారం తాను కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. ఈ నెల 16కు బదులుగా, 17న విచారణకు హాజరవుతానని ఎమ్మెల్యే కోరినట్లు తెలిసింది.