ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరంలో
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
జగిత్యాల, (విజయ క్రాంతి): అన్ని ఇంద్రియాల కంటి చూపు ప్రధానం అని, కంటి చూపు లేకుంటే ప్రపంచమే చీకటి మాయం గా మారుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి,రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్ర చికిత్స శిబిరం ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 17 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ సృవేంద్రియాo నయనం ప్రధానం అని కంటి రక్షణ కోసం రెప్పలు ఉన్నాయని వాటితో పాటు మనం కంటిని రక్షించుకోవాలని అన్నారు. అనంతరం ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు క్యాదాసు నాగయ్య, పోతూనుక మహేష్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.