29-03-2025 09:43:29 PM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి,(విజయక్రాంతి): మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతి ఏటా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా దావత్ ఏ ఇఫ్తార్ వేడుకలు నిర్వహిస్తారు.హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలసి మెలసి అన్నదముల్ల ఉండాలన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.