calender_icon.png 11 March, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్’

11-03-2025 12:24:34 AM

  • సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే నిజజీవితపై సినిమా

ఉగాదికి చిత్రీకరణ ప్రారంభం

సంగారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి): సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. జగ్గారెడ్డి వార్ ఆర్ లవ్ టైటిల్‌తో సినిమా నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు. జగ్గారెడ్డి నిజజీవిత పాత్రతోనే ఆ సినిమాలో నటిస్తారని తెలిసింది. ఉగాది పండుగకు సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తారని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అనుమతితోనే సినిమాలో నటిస్తున్నారని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నిజజీవితంపై సినిమా తీస్తామని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీసేందుకు  ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.