calender_icon.png 10 March, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపై జగ్గారెడ్డి.. ఉగాదికి రిలీజ్

10-03-2025 02:24:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. రాబోయే 'ఎ వార్ ఆఫ్ లవ్' చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాని జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వడ్డి రామానుజం అందించారు. ఈ సినిమాలో తన నిజ జీవిత వ్యక్తిత్వం ఆధారంగా ఒక పాత్రను పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఉగాదికి 'ఎ వార్ ఆఫ్ లవ్' విడుదల కానుందని ఆయన వెల్లడించారు. విరామం ముందు నుంచి సినిమా క్లైమాక్స్ వరకు తన పాత్ర కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో నటించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జగ్గారెడ్డి వెండితెర అరంగేట్రం ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.