calender_icon.png 27 October, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్ చేరిష్మా తెలుస్తోంది

27-10-2024 06:35:23 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... ఎలాంటి కారణం, వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటి వద్ద పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడో జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగితే కేటీఆర్ కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి సీఎం సోదరుల ఇళ్ళపై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా..? అని మండిపడ్డారు. 

స్వయంగా పోలీసులే రేవంత్ రెడ్డి తమ్ముడితో సెటిల్ చేసుకోమ్మని బాధితులకు చెబుతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకామని, పై నుండి మోడీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. నిజాం కాలంలో కూడా ఇంతలా దుర్మార్ఘంగా పనిచేయలేదని, ఈ చిల్లర దాడులు తమని ఏం బయపెట్టలేవు, తమకు అరెస్టులు కొత్త కాదని  జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్, సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో కేటీఆర్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గొంతుకైన కేటీఆర్ కి సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు వేస్తుందని, ఎన్ని కుట్రలు చేసినా మా ప్రజాపోరాటం ఆగదని  ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్ చేరిష్మా తెలుస్తుందన్నారు. లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి దిగజారినా.. కేటీఆర్ ఇమేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అని జగదీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని, లేకపోతే తప్పకుండా తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయాలని, రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని జగదీష్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, వెంటనే సోదాలు అపి పోలీసులు వెనక్కి వెళ్లాలని కోరారు. దాడులు ఇలానే కొనసాగితే పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.