calender_icon.png 15 November, 2024 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్‌కు ఇంగిత జ్ఞానం లేదు

12-11-2024 01:48:57 AM

  1. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతాననడం అవివేకం
  2. వైసీపీ అధినేత జగన్‌పై షర్మిల ఘాటు విమర్శలు

  3. అమరావతి, నవంబర్ 11: స్వయం కృతాపరాధం కారణంగానే వైసీపీ అధినేత జగ న్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం ఆయన అవివేకానికి, అజ్ఞానానికినిదర్శనమన్నారు. ప్రజలు ఓట్లేసింది అసెంబ్లీ మీద అలగడానికో లేదా మైక్ ఇస్తేనే వెళ్తానని మారాం చేయడానికో కాదన్నారు.జగన్ తీరు అత్త మీద కోపం దుత్తపై చూపినట్టు ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా అభిర్ణించి న ఆమె ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజా పక్షం అవ్వాలనే ఇంగిత జ్ఙానం జగన్‌కు లేకపోవడం బాధాకరమన్నారు. 

అప్పుడు కాంగ్రెస్ కుంగిపోలేదు

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలని ఎప్పుడూ మారాం చేయలేదని పేర్కొన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినా కుంగిపోలేదన్నారు. అలాగే 2014లో కేంద్రంలో 44 సీట్లు, 2019లో 52 సీట్లకే పరిమితం అయినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని గుర్తు చేశారు.

అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేసిందన్నారు. వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లాలని లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.