calender_icon.png 31 October, 2024 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్ కేసులపై రోజూ విచారించాలి

04-07-2024 12:48:11 AM

సీబీఐ కోర్టుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాబడికి మించి ఆస్తులను ఆర్జించారనే కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులను రోజూ విచారణ చేయాలని సీబీఐ కోర్టుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారంటూ సీబీఐ కేసులను నమోదు చేసింది. దీనిపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ తీరును హైకోర్టు సమీక్షించింది. అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు ఎంపీలపై నమోదైన కేసులను సత్వర విచారణ చేయాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ జారీ చేసిందని గుర్తుచేసింది.

30 రోజుల క్రితం జరిపిన విచారణ నాటికి ఇప్పటికి పెద్దగా పురోగతి లేదని తప్పుపట్టింది. ఇకపై రోజువారీ విచారణ జరపాలని ఆదేశించింది. ఆ తర్వాత కేసుల విచారణ పురోగతి వివరాలను అందజేయాలని సూచించింది. తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది. జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసుల విచారణ తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్ కుమార్ డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. కేసుల విచారణ జాప్యమయ్యేలా నిందితులు కావాలని చేస్తున్నారని పిటిషనర్ వాదన. ఇకపై రోజు వారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ నెల 23న జరిగే విచారణ నాటికి స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని స్పష్టంచేసింది.