calender_icon.png 27 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్ ఎంతకైనా తెగిస్తారు

27-10-2024 01:53:18 AM

  1. బెయిల్ కోసం వైఎస్ పేరునూ కేసులో ఇరికించారు
  2. సుబ్బారెడ్డి బాబాయి లబ్ధి పొంది జగన్‌కు మద్దతిస్తున్నారు
  3. ఎంవోయూ నిజం కాదని బిడ్డలపై ప్రమాణం చేస్తారా?
  4. కన్నీటి పర్యంతమైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

అమరావతి, అక్టోబర్ 26: ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మూడ్రోజులుగా తన అన్న, ఏపీ మాజీ సీఎం జగన్‌పై కాం గ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. ఆస్తి పంపకాలకు సంబంధించి ఇరు వురి మధ్య జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేస్తూ షర్మిల శుక్రవారం జగన్‌తో పాటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖపై వైసీపీ నేత లు షర్మిలపై ఘాటుగా స్పందిస్తున్నారు.

బంధువు వైవీ సుబ్బారెడ్డి కూడా షర్మిలపై ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి జగన్‌తో పాటు సుబ్బారెడ్డిపై షర్మిల విరుచుకుపడ్డారు. జగన్ తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారని అన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ సుబ్బారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ కళ్ల ముందే పెరిగిన తన బిడ్డలకు ఎలా  అన్యా యం చేశారని, అన్ని విషయాలు తెలిసి కూడా బాబాయి ఎందుకిలా మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ నుంచి లబ్ధి పొంది ఆయన మోచేతి నీళ్లు తాగే వ్యక్తి కాబట్టే సుబ్బారెడ్డి అలా మాట్లాడారని ఆరోపించారు. 

మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా?

జగన్ పదవులిస్తే సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారు. అం దు కే  బాబాయి అలా మాట్లాడుతున్నారు. సాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడతారు. శుక్రవారం రాసిన లేఖలోనూ వాళ్ల పేర్లను ప్రస్తావించా. నేను చెప్పినవన్నీ నిజమని నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా.

సుబ్బారెడ్డి చెబుతున్నది నిజమని ఆయన ప్రమాణం చేయగలరా? నలుగురు మనవళ్లకు ఆస్తిలో సమాన వాటా ఉంటుందని వైస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగానే చెప్పారు. ఇది నిజం కాదని సుబ్బారెడ్డి, జగన్ వారి బిడ్డలపై ప్రమాణం చేస్తారా? ఏవో కథలు చెప్పిన నాకు రావాల్సిన వాటాను మింగేస్తే ఎలా? నాకు తోడుగా ఉంటానని వైఎస్‌కు జగన్ మాటిచ్చారు.

ఇప్పుడు సాక్షి, భారతి సిమెంట్స్‌లో వాటాలు తమవేనని జగన్ ఎలా చెబుతారు? నేను అంగీకరిస్తేనే వైఎస్ అనుమతితో కంపెనీలకు భారతి, జగ తి అని పేర్లు పెట్టుకున్నారు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులన్నీ వారికే చెందు తాయా? ఆస్తులు మొత్తం జగన్ పేరుపైనే ఉన్నాయి కాబట్టే ఆయన జైలుకు వెళ్లారని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భారతి పేరుపైనా ఆస్తులు ఉన్నాయి కదా.. ఆమె ఎందుకు వెళ్లలేదు? అని షర్మిల ప్రశ్నించారు. 

వైఎస్‌ను కూడా కేసులోకి లాగారు

వివిధ కేసుల్లో తనకు లాభం జరుగుతుందనే తల్లిని జగన్ కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. జగన్ బయటపడేందుకు ఎఫ్‌ఐఆర్‌లో రాజశేఖర్‌రెడ్డి పేరు ఉండేలా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి చేర్పించారన్నారు.

తను లబ్ధి పొందేందుకు ఎవరినైనా జగన్ అణచివేస్తారని ధ్వజమెత్తారు. విజయమ్మను కోర్టుకు లాగిందెవరో వైసీపీ శ్రేణులు ఆలోచించాలని షర్మిల సూచించారు. జగన్ ఎలాంటి వారో  గుర్తించాలని, ఆయన నాయకుడో లేదా శాడిస్టో అర్థం చేసుకోవాలన్నారు. తానేం తప్పు చేశానని వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారని షర్మిల అడిగారు.  

కళ్లల్లో నీళ్లు తిరిగాయి

తనకు గిఫ్ట్ ఇచ్చినట్లు సుబ్బారెడ్డి అన్నారని, గిఫ్ట్ ఇస్తే ఎంవోయూ రాసుకుంటారా? అని షర్మిల నిలదీశారు. ఎంవోయూ చేశామంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని, దీనికి సుబ్బారెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి గొడవలు అందరి ఇళ్లలో ఉంటాయని సుబ్బారెడ్డి బాబాయి తేలికగా మాట్లాడారని, ఆయన మాటలతో తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పా రు.

జగన్ కోసం నేను, అమ్మ ఎంతో కష్టపడ్డామని, ఆస్తి పంపకాలకు సంబంధించిన ఎంవోయూ తన వ ద్దే ఉన్నా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదన్నారు. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా బయటపెట్టలేదన్నారు.