calender_icon.png 14 December, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగజ్జేత గుకేశ్

13-12-2024 12:44:26 AM

  1. ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం
  2. 14వ గేమ్‌లో డింగ్ లిరెన్‌పై విజయం
  3. విశ్వనాథన్ ఆనంద్ సరసన గుకేశ్
  4. అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు

  5. గుకేశ్ దొమ్మరాజు.. ఈ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని సొంతం 
  6. చేసుకొని చదరంగంలో కొత్త రారాజుగా అవతరించాడు. ఎంతో మంది భారత చెస్ గ్రాండ్‌మాస్టర్లకు సాధ్యం కాని ఫీట్‌ను సాధించి ఔరా అనిపించాడు. చిన్నప్పటి నుంచి విశ్వనాథన్ ఆనంద్ ఆటను చూస్తూ పెరిగిన 18 ఏళ్ల కుర్రాడు ఇవాళ 64 గడుల చదరంగంలో రారాజుగా నిలిచి తన గురువు చేత శెభాష్ అనిపించుకున్నాడు.

  7. సింగపూర్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక 18వ ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశ్ జగజ్జేతగా నిలిచాడు. గురువారం జరిగిన చివరి గేమ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ (7.5 పాయింట్లు) సాధించి టైటిల్ అందుకున్నాడు. కాగా 18 ఏళ్లకే ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచి టైటిల్ అందుకున్న గుకేశ్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.

  8. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ అందుకున్న రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గానూ నిలిచాడు. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్కంఠగా సాగిన 14వ గేమ్‌లో గుకేశ్ 58 ఎత్తుల వద్ద లిరెన్‌పై విజయాన్ని అందుకున్నాడు. అయితే చివర్లో గుకేశ్ ఎత్తులకు లిరెన్ సమాధానం చెప్పలేక ఓటమిని అంగీకరించాడు. 14వ గేమ్‌కు ముందు గుకేశ్, లిరెన్ చెరో 6.5 పాయింట్లు కలిగి ఉన్నారు. ఈ విజయంతో గుకేశ్ 7.5 పాయింట్లు సాధించి టైటిల్‌తో పాటు 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.21 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.

  9. 11 ఏళ్ల క్రితం ప్రేక్షకుడిగా వెళ్లి..

  10. 2013లో చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, కార్ల్సన్ మధ్య చెన్నైలో జరిగిన బ్లిట్జ్ చెస్ వరల్ ఛాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతుంది. ఈ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరైన గుకేశ్ ఒక మూలన కూర్చొని వారిద్దరి ఆటను ఆసక్తిగా గమనించాడు. ఆ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధించా రన్నది పక్కనబెడితే అక్కడికొచ్చిన ఏడేళ్ల గుకేశ్ తాను ఏదో ఒకరోజు అంతర్జాతీయ చెస్ వేదికపై అంతటి పేరు సంపాదించాలని కలలు కన్నాడు. ఆ కల తీరడానికి పెద్దగా సమయం పట్టలేదు. సరిగ్గా 11 ఏళ్లకు గుకేశ్ చద రంగంలో రారాజుగా నిలిచి ఔరా అనిపించాడు.

  11. అమ్మా, నాన్న.. ఓ తెలుగబ్బాయి

  12. తమిళనాడుకు చెందిన గుకేశ్ వాస్తవానికి మనోడే. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాకు చెందినవారు. గుకేశ్ తండ్రి రజనీకాంత్ ప్రముఖ ఈఎన్టీ నిపుణు లు కాగా.. తల్లి పద్మ మైక్రోబయాల జిస్ట్. గుకేశ్ విజయాల వెనుక అతని తల్లిదండ్రుల త్యాగం, ప్రోత్సాహం మరువలేనిది. తమ కుమారుడి కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు వాళ్ల కెరీర్‌ను పణంగా పెట్టారు.  2019 జనవరి లో 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు.

  13. గుకేశ్ తొలి మేజర్ టైటిల్‌ను 2018లో సాధించాడు.  2022 ఫిడే చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం.. టీమ్ విభాగంలో కాంస్యం గెలుచు కున్నాడు. ఈ ఏడాది ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గిన గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిం చాడు. ఆ తర్వాత మొత్తం చరిత్రే.. ఇక విజేతగా నిలిచిన గుకేశ్‌ను రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

  14. పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నా. నేను కన్నకల ఇవాళ నిజమవ్వడం నమ్మలేకపోతున్నా. చెస్ చాంపియన్అవుతానని అస్సలు ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. చాలా సంతోషంగా ఉంది.
  15.  గుకేశ్, భారత గ్రాండ్‌మాస్టర్