16-03-2025 01:59:56 AM
స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి ఏక వచనంతో మాట్లాడలేదని తెలిపారు. ఆయనను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. సభ సంప్రదాయాలను జగదీశ్ రెడ్డి ఉల్లంగించలేదని.. వెంటనే ఆయనపై సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్‌ను కోరారు.