15-03-2025 12:00:00 AM
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి
వికారాబాద్, మార్చ్-14: తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక దళిత స్పీకర్ ను అవమానించినందుకు జగదీశ్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్పీకర్ పై జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌర స్తాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని శాసనసభ సభ్యత్వన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
బీ ర్ ఎస్ పార్టీ దళితుడు స్పీకర్ అయినందుకు ఓర్వలేకపోతున్నారని కెసిఆర్ నిరంకుశత్వానికి నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన ఒక నిదర్శనమని,తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో బీఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని ఇలాంటి సంఘటనలు ఇకపై జరుగుతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిo చారు.