calender_icon.png 17 March, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్‌కు జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

17-03-2025 01:09:00 AM

పలుచోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం 

మేడ్చల్/కుత్బుల్లాపూర్, మార్చి 16 (విజయకాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో  స్పీకర్‌ను అవమానించారని, ఇందుకు నిరసనగా  కాంగెస్ పార్టీ ఆధ్వర్యం లో గుండ్ల  పోచంపల్లిలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్  కాంగెస్ పార్టీ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత స్పీకర్‌ను  అవమానించిన జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్  నాయకులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యకమంలో  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దమ్మున్న గారి పభాకర్, మాజీ సర్పంచ్ ఈశ్వర్, నరేందర్  రెడ్డి, బండారి నరేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌లో...

మేడ్చల్లో  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యకమంలో మున్సిపల్  అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, చాపరాజు, కౌ డే మహేష్, రాజు  యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాలని  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో...

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపే ట్  మున్సిపల్ కార్పొరేషన్ బాచపల్లి చౌరస్తాలో నిజాంపేట్ కాంగెస్ పార్టీ అధ్యక్షులు కొలన్  రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం పసాద్ కుమా ర్‌ని  అవమానించినందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు.

జగద్గిరిగుట్టలో..

టిపిసిసి రాష్ట్ర పధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి  ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో ఆదివారం బీఆర్‌స్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను  దహనం చేశారు.

ఈ కార్యకమంలో స్థానిక నాయకులు కమ్మెట నారాయణ, కొలన్ జీవన్  రెడ్డి, రాజిరెడ్డి, నవీన్, వీరబాబు, నారాయణ రెడ్డి, బికెండ్ షా, మల్లికార్జున్, సురేందర్  యాదవ్, విష్ణు, శరత్, మహేందర్, వేణుగోపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఆంజనేయ  వర్మ, హర్యానాయక్, మురళి, వెంకటేష్ పటేల్, కమ్మెట  జీతయ్య, మౌలీశ్వరరావు, లక్ష్మణ్, ఆదిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.