calender_icon.png 18 March, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్‌కు జగదీశ్‌రెడ్డి సారీ చెప్పాలి

15-03-2025 12:00:00 AM

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి

చేవెళ్ల, మార్చి 14: అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించేలా మాట్లాడిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  జ్యోతి భీమ్ భరత్ డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. స్పీకర్ దళితుడు అయినందునే బీఆర్ఎస్ పార్టీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రసాద్ కుమార్ అట్టడుగు నుంచి స్పీకర్ స్థాయికి ఎదిగారని, అది ఓర్వలేకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కోల్పోవడంతో దిగజారి ప్రవర్తిస్తున్నారని, దీన్ని బట్టే వారి విధానాలేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డికి సభా సంస్కారాలు తెలియక పోవడం బాధాకరమని మండిపడ్డారు.  శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన  సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.