calender_icon.png 16 March, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దుచేయాలి

15-03-2025 12:54:48 AM

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి  

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కోరారు. బీఆర్‌ఎస్ నాయకులకు దళితులంటే చిన్నచూపుగా ఉందని, అం దుకే దళిత సామాజికవర్గానికి చెందిన స్పీకర్‌పై అనుచితంగా ప్రవర్తించారని శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ నాయకు లు దళిత నేతలపై మొదటి నుంచి అవమానకరంగానే ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక సీఎం అయ్యారని మండిపడ్డారు.