17-03-2025 12:00:00 AM
ఆగ్రహం వ్యకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
పెబ్బేరు, మార్చి 16: దళిత సభాపతి గడ్డం ప్రసాద్ పట్ల అహకారంతో అవమానపర్చి మాట్లాడిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తగదని ఉమ్మడి మండలాల కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు మండల, పట్టణ అధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, వెంకట్ రాములు యాదవ్ నేతృత్వంలో ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
సభాపతి పై అహకారంగా మాట్లాడిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కి కేటీఆర్ వత్తాసు పలకడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి అధికారం ఇవ్వనందుకు అహకారం, అసహనం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేస్తున్నారని ఆరో పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమా పణ చెప్పి మీ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ నేర్పించాలని హితువుపలికారు. బహు జనులను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. సభాపతి గడ్డం ప్రసాద్ కు కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమోదిని, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, నాయకులు రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, సురేందర్ గౌడ్, యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.