16-03-2025 07:16:09 PM
పాపన్నపేటలో దిష్టి బొమ్మ దగ్ధం..
పాపన్నపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరకరమని, ఆయన అహంకార పూరిత మాటలను నిరసిస్తూ ఆదివారం ఆయన దిష్టి బొమ్మను మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ లు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల చూపిస్తున్న ధోరణి సరికాదన్నారు. దళిత సీఎం అని చెప్పి మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఓర్వలేకనే బిఆర్ఎస్ లీడర్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మరోసారి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే, రెండోసారి రేవంత్ రెడ్డి సీఎం అవుతారని, మైనపల్లి రోహిత్ ఎమ్మెల్యే అవుతారని పేర్కొన్నారు. అనంతరం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్ గుప్తా మాట్లాడుతూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకొని, స్పీకర్ కు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మల్లప్ప, నాయకులు రమేష్ గౌడ్, పట్లోళ్ల నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్, బాబర్, గౌస్, శ్రీధర్, రఘు, నాని, ముశెట్టి కిష్టయ్య, గూడెం నాని, మురళి, రాజేందర్, నరేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు విఠల్, నాగరాజు, గోపాల్ రావు, అంజి, దుర్గేష్, సాయిలు, చోటు తదితరులు పాల్గొన్నారు.