calender_icon.png 18 January, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ

17-01-2025 07:57:27 PM

జగద్గురు నరేంద్రచార్య మహారాజ్ పాదుక దర్శనం..

హాజరైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహారాష్ట్రలోని జగద్గురు రామానంద చార్య దక్షిత్ పిఠ్ నానాజీ దాం ప్రియ శిష్యుడు స్వామి జగద్గురు నరేంద్ర చార్య మహారాజ్ పాదుక దర్శన కార్యక్రమాన్ని నిర్వాహకులు అంగరంగ వైభవపీతంగా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తాటి పెళ్లి నివాసం నుండి స్వామివారి పాదుకలను శోభయాత్రగా ప్రేమల గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి అత్యంత వైభవ వేదంగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Laxmi) మాట్లాడుతూ... మానవసేవే మాధవ సేవగా దేశంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నరేంద్ర చార్య మహారాజ్ సేవలు వెలకట్టలేనివని తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని వారు చూపుతున్న సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. సంస్థ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పాదుక దర్శనం చేసుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది.