calender_icon.png 12 March, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్

12-03-2025 12:18:45 AM

  • పట్టాలు పేల్చి.. ఆపై కాల్పులు 

ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ౩0 మంది పాక్ జవాన్లు 

లాహోర్, మార్చి 11: పాకిస్థాన్‌లో సుమా రు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం హైజా క్ అయింది. రైలును తామే హైజాక్ చేసిన ట్టు బలోచిస్తాన్ వేర్పాటు ఉగ్రసంస్థ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. పలు భద్రతా సంస్థల్లో పని చేస్తున్న 2౧౪ మందిని బందీలుగా తీసుకోవడంతోపాటు ౩0 మంది పాక్  సైనికులను హత మార్చినట్టు వెల్లడించింది.

భద్రతా బలగాలు వెనక్కి తగ్గపోతే బందీలుగా ఉన్న వారందరినీ హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేసింది. బలోచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్లే దారిలో ౧౭ టన్నెళ్లు ఉండగా ౮వ టన్నెల్‌లో ముందుగా పట్టాలు పేల్చి, ఆ తరవాత  దాడి జరిపింది.  రైలుపై బీఎల్‌ఏ దాడి జరిపిందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. 

రంగంలోకి పాక్ ఆర్మీ

బీఎల్‌ఏ చేతిలో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు పాకిస్థాన్ ఆర్మీ రంగంలోకి దిగింది. బీఎల్‌ఏ సభ్యులపై భూతల దాడులతోపాటు వైమానిక దాడు లు కూడా జరుపుతోంది. అయితే భూతల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాక్ ఆర్మీ వెనక్కి తగ్గిందని బీఎల్‌ఏ కమాండర్ ప్రకటించారు.

వైమానిక దాడులు మా త్రం ఇంకా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు తాము బందీలుగా తీసుకున్న వారిలో సెలవుపై పంజాబ్‌కు వెళ్తున్న పాకిస్థాన్ ఆర్మీ జవానులు, ఆంటి టెర్రరిజం ఫోర్స్(ఏటీఎఫ్), పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నట్టు బీఎల్‌ఏ వెల్లడించింది. భద్ర తా దళాలు ఏదైనా మిలటరీ ఆపరేషన్‌ను ప్రారంభిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.