calender_icon.png 19 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన

05-08-2024 04:48:47 PM

మహబూబ్ నగర్: జడ్చర్ల మండలంలో శంకరాయ పల్లి తండా నుండి మాటుబండతాండా వరకు 1కోటీ 74లక్షలతో, బండమీదిపల్లి నుండి శంకరాయపల్లితాండా వరకు 68 లక్షలతో నూతనంగా వేస్తున్న బీటీ రోడ్లకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జడ్చర్ల నియోజకవర్గంలోని వివిద గ్రామాలలో దాదాపుగా 13 రోడ్లను 31 కిలోమీటర్లుగా 21.6 కోట్లతో సాంక్షన్ చేయించి నేడు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో 8(32kv)సబ్ స్టేషన్లను సాంక్షన్ చేయించామని తెలిపారు. తొందర్లోనే జడ్చర్ల నియోజకవర్గంలో నిరుపేదలందరికీ 3500 ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు. ఇండ్ల పంపిణీలో ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.