calender_icon.png 1 April, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారం కాదు.. పని ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే

30-03-2025 11:21:11 AM

జడ్చర్ల కు కొత్త గా 4 విద్యుత్ 33/11కేవీ సబ్ స్టేషన్లు మంజూరు

రూ. 14.60 కోట్లతో  కొత్త సబ్ స్టేషన్లు గొల్లపల్లి, ఆలూరు, రాణి పేట తో పాటు జడ్చర్ల పట్టణంలో ఏర్పాటుకు చర్యలు

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి

జడ్చర్ల: ప్రజలకు కావాల్సింది ప్రచారం కాదని... వారు కోరుకున్నది కోరుకునేది కేవలం ప్రజా సంక్షేమమే అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. జడ్చర్ల నియోజక వర్గంలో కొత్తగా నాలుగు విద్యుత్ 33/11 కేవి సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. రూ.14.60 కోట్ల రూపాయల వ్యయం తో ఈ కొత్త సబ్ స్టేషన్ల ను గొల్లపల్లి, ఆలూరు, రాణి పేట తో పాటు జడ్చర్ల పట్టణంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కొత్త సబ్ స్టేషన్ల ను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు జడ్చర్ల నియోజకవర్గం(Jadcherla Constituency)కు మాత్రమే మొత్తం 12 స్టెబిలిటీషన్లో మంజూరు కావడం శుభ పరిణామం అన్నారు.  ఈ సబ్ స్టేషన్లలో గొల్లపల్లి సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.53 కోట్లు, ఆలూరు సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.86 కోట్లు, జడ్చర్ల పట్టణం లో నిర్మించే సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.54 కోట్లు, రాణి పేట సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.67 కోట్లు చొప్పున మొత్తం రూ.14.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.ఈ కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం తో విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడుతుందని చెప్పారు. గతంలో మంజూరు అయిన 8 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు కూడా సకాలంలో పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని పేర్కొన్నారు.