calender_icon.png 16 January, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను తప్పు చేయను.. తప్పు చేస్తే వదిలిపెట్టను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

09-09-2024 02:44:12 PM

మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అసమర్థుడు

బంధువుల భూమి కోసం దళితులకు అన్యాయం చేసిండు

ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, (విజయక్రాంతి): జడ్చర్ల ఎమ్మెల్యేగా తాను ఏలాంటి తప్పు చేయను.. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల లోని చంద్రగార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన బంధువుల భూమి కోసం దళితులకు అన్యాయం చేసాడని ఆరోపించారు. జడ్చర్లలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి పేరిట దళితులకు భూమిని లాక్కున్నారని చెప్పారు. ఆసుపత్రి చుట్టు పక్కల మాజీ ఎమ్మెల్యే బంధువులు, ఆయన అనుచరుల భూములు ఉన్నాయని తెలిపారు. భూమి కోల్పోయిన బాధితులకు నేటికీ నష్ట పరిహారం దొరకలేదని చెప్పారు.

ప్రభుత్వ భూములను తారుమారు చేసేందుకు అధికారులు సైతం తప్పుడు రికార్డులు తయారు చేసినట్లు తన విచారణలో తేలిందని చెప్పారు. తప్పులు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే భూ కబ్జాలు, అక్రమ ఇసుకను అరికట్టలేని అసమర్థుడు అని విమర్శించారు. తొందరలోనే గాంధీ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి భూముల కబ్జాలపై బయట పెడతానని వెల్లడించారు. బాలానగర్, గంగపూర్ రహదారి పనుల అడ్డంకులతో ప్రజలకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వ జి.ఓ క్యాన్సాల్ కాకుండా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించమని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.