మహబూబ్ నగర్: జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడిని నిరసిస్తూ బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మహబూబ్ నగర్, జడ్చర్ల కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.