calender_icon.png 26 February, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల నిలయం జడ్చర్ల బస్టాండ్

26-02-2025 12:51:30 AM

  • ఇచ్చిన స్థలం కంటే అదనపు స్థలంలో వాహనాల పార్కింగ్ 

బస్టాండ్ నిండా షాపులు.. కూర్చోవడానికి స్థలం కరువు

మరో మూడేళ్లయితే గడువు పూర్తవుతుందంటున్న అధికారులు 

బస్టాండ్ బహిరంగ ప్రదేశంలోనే వంటకాలు 

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికార యంత్రాంగం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి (విజయ  క్రాంతి): ప్రయాణికుల సమస్యలకు నిలయంగా జడ్చర్ల బస్టాండ్ నిలుస్తుంది. ప్ర యాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవరిస్తున్నారు. బస్టాండ్ ఉన్న ప్రాంగణమంతా వివిధ షాపుల ఏర్పాటు నిమిత్తం ఖాళీ స్థలాలను అద్దెకు ఇవ్వడం జరిగింది. బస్టాండ్ అంతా వ్యాపారస్తులు వారి షాపులను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రతిరోజు వేలాదిమంది జడ్చర్ల బస్టాండ్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. బస్టాండ్ లో ఉన్న స్థలం షాప్‌లో ఏర్పాటుకు అద్దెకివ్వడంతో ప్రయాణికులకు  కనీసం కూర్చు నేందుకు కూడా కుర్చీలు లేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూనే ఆర్టీసీ అధికారుల తీరును తప్పుపడుతున్నారు. 

బహిరంగ ప్రదేశంలోనే వంటకాలు

జడ్చర్ల బస్టాండ్‌లో హోటల్ ఏర్పాటు చేసేందుకు అద్దెకు ఇవ్వడం జరిగింది. ఈ హోటల్ ద్వారా ఆర్టీసీకి ప్రతినెల దాదాపు రూ 5 లక్షలు అద్దె రావడం జరుగుతుంది. ఈ హోటల్ ఏర్పాటలో ఎక్కడ కిచెన్ ఉండాలి? ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుం డా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

హోటల్ లో ప్రత్యేకంగా కిచెన్ ఉన్నప్పటికీ బస్టాండ్ లో హోటల్ కు ఇచ్చిన బహిరంగ ప్రదేశంలో నూనె బాండీలను ఏర్పాటు చేసి వివిధ తినుబండారాలను తయారు చేస్తుం డ్రు. గ్యాస్ సిలిండర్లు, బాండిలో నూనె బహిరంగ ప్రదేశంలో చేయడం ద్వారా ప్రాణుల కు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న వెలకట్టలేని పరిస్థితి నెలకొంటుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తుం డ్రు.

హోటల్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిచెన్ లోనే తినుబండాలని తయారు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతుండ్రు. 

అదనపు స్థలంలో పార్కింగ్...

ఆర్టీసీ నిబంధన మేరకు పార్కింగ్ చేసేందుకు టెండర్ దారుడికి ఇచ్చిన స్థలం కంటే అత్యధిక స్థలంలో వాహనాలను పార్కింగ్ చేస్తుండ్రు. ఆర్టీసీ అధికారులకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ సంబంధిత పార్కింగ్ యజమానికి సహకరిస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనలు ఒకలా చెప్పుకుంటూ మరోల సహకరించడం ఏంట ని, ఆర్టీసీకి అదనపు స్థలం అందిస్తే అదనంగా రావలసిన ఆదాయానికి గండిపడేలా ఆర్టీసీ అధికారుల తీరు కనిపిస్తుంది. నిబంధనల మేరకు పార్కింగ్ స్థలం కేటాయించి అప్పగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

బస్టాండ్ అంతా షాపులే.. కూర్చునేది ఎక్కడ..?

జడ్చర్ల బస్టాండ్ చాలా ప్రత్యేకత కలిగినది.  ప్రధాన హైవేపై ప్రధానంగా ఉన్న బస్టాండ్‌లో జడ్చర్ల  బస్టాండ్ అతి ముఖ్యమైనది. ఈ బస్టాండ్ లోని ఖాళీ స్థలాలను ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు అద్దెకు ఇవ్వడం జరిగింది. బస్టాండ్ ప్రాంతంలోని షాపులు అత్యధికంగా ఉండటం వల్ల ప్రయాణికులు కూర్చునేందుకు వీలు లేకుండా పో యింది.

ఆర్టీసీ అధికారులు ఉన్న స్థలంలో సద్వినియోగం చేసుకొని ప్రయాణికులు కూ ర్చునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు నిరంతరం తిరుగుతున్న నిబంధనలను పాటించకుండా ఉన్న ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

పర్యవేక్షణ చేస్తున్నాం...

బస్టాండ్ లో పార్కింగ్ స్థలం కొంత మేరకు పార్కింగ్ నిర్వాహకులు ఉపయోగించుకుంటున్న విషయం నిజమే. వారికి కూడా చెప్పడం జరిగింది కేటాయించిన స్థలంలో మాత్రమే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. బస్టాండ్లో షాపులు అత్యధికంగా ఉండడం గతంలో టెండర్ వేసి ఇవ్వడం జరిగింది. మరో మూడేళ్లు ఆ షాపులు కొనసాగించడం జరుగుతుంది. మరిన్ని విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. 
 రామ్మూర్తి, స్టేషన్ మేనేజర్, జడ్చర్ల బస్టాండ్