calender_icon.png 27 December, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్క్‌కు జాక్‌పాట్

08-11-2024 12:25:51 AM

2 లక్షల కోట్లకు పెరిగిన సంపద

వాషింగ్టన్, నవంబర్ 7: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అవడంతో అమెరికా స్టాక్ మార్కెట్లో జోష్ పెరిగి సానుకూల ఫలితాలు కనిపించాయి. చాలా కంపెనీల షేర్లు లాభా ల బాటన పయణించాయి. దీంతో పలువురి సంపద అమాంతంగా పెరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థ మరల గాడిన పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి.

ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారీ ప్రచారం చేశారు. అంతేకాకుండా ట్రంప్‌నకు మద్దతు ప్రకటించి అధిక మొత్తంలో విరాళాలు అంద జేసి ప్రచారాన్ని ఉరకలెత్తించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏకపక్షంగా విజయం సాధించడంతో మస్క్ సంపద 26.5 బిలియన్ డాలర్ల(రూ.రెండు లక్షల కోట్లు) మేర అమాంతం పెరిగిపోయింది.

దీంతో ఆయన నికర సంపద 290 బిలియన్ల డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ  కుబేరుల జాబితాలో మస్క్ మొదటిస్థానంలో ఉన్నారు. ట్రంప్ గెలుపుతో మస్క్ చెందిన సంస్థల షేర్లపై ఎన్నికల ఫలితాలు సానుకూల ప్రభావాన్ని చూపడంతో ఆయనకు భారీగా లాభాలు వచ్చాయి.

అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద సుమారు రూ. 60 వేల కోట్లకు పెరిగింది. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నికర సంపద కూడా భారీగానే పెరిగింది.