calender_icon.png 13 December, 2024 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై బీటీపీఎస్ లో జేఏసీ నిరసన

13-12-2024 02:17:21 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా బీటీపీఎస్ లో శుక్రవారం టీజీపీఈ (తెలంగాణ పవర్ ఎంప్లాయిస్) జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'ప్రైవేటైజేషన్ వ్యతిరేక' దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కర్మాగాలంలోనే సర్వీస్ బిల్డింగ్ ఎదుట జరిగిన సమావేశంలో టీజీపీఈఏ (తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్) బీటీపీఎస్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతోపాటు పేదలకు బలహీన వర్గాలకు ఇస్తున్న విద్యుత్ క్రాస్ సబ్సిడీలు ఎత్తివేస్తారని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులందరూ ఐక్య ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన భాగంగా ఈనెల 19న కూడా నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీపీఈఏ సెంట్రల్ కమిటీ సెక్రటరీ రవి ప్రసాద్, అసోసియేషన్ నాయకులు రవితేజ, నరేష్, సాయిరాం, టీఎస్పీఈయూ-1535 రీజనల్ అధ్యక్షుడు వి.ప్రసాద్, కార్మిక సంఘం-327 రీజనల్ అధ్యక్షులు బి.కృష్ణ, కార్మిక సంఘం-1104 నాయకులు వెంకట్రాం, సీఐటీయు నాయకులు వీరస్వామి  తదితరులు పాల్గొన్నారు