calender_icon.png 4 February, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు..

03-02-2025 08:52:54 PM

మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి. చెన్నయ్య..

ముషీరాబాద్ (విజయక్రాంతి): నరేంద్ర మోడీ హామీలు నెరవేర్చలేదని, బీజేపీ భజన డప్పు కొడుతూ.. మాలలకు చావు డప్పు కొడతానంటున్న మందకృష్ణ మాదిగ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య, జేఏసీ నేత బేర బాలకిషన్ (బాలన్న) హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ చేపట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమం సందర్భంగా మాలలకు చావు డప్పులు కొడుతున్నామని, చేసుకుంటున్న ప్రచారాన్ని మాల సంఘాల జేఏసీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మాలలకు చావుడప్పు కొట్టాలని చెప్తున్నా మందకృష్ణ మాటలను వారు తప్పుపట్టారు. మందకృష్ణ చావు డప్పు కొట్టాల్సింది మాలలకు కాదు. నీ ప్రియ మిత్రుడు నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, నిత్యం నీవు కాలు మొక్కే వెంకయ్య నాయుడులకు అన్నారు.

ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటుంది. మాలలు కాదని, నువ్వు నమ్ముకున్న నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నారని వారు అన్నారు. వర్గీకరణపై హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ వర్గీకరణపై ఎందుకు వెనక్కి తగ్గాడని అన్నారు. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నరేంద్ర మోడీ హామీకి సంబంధం లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా వర్గీకరణకు అడ్డుపడుతుంది ఫక్తు నరేంద్ర మోడీ మాత్రమే అన్నారు. మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణ జరగడం, మాదిగలు బాగుపడడం మందకృష్ణకు ఇష్టం లేదన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టించలేకపోతున్నావని వారు ప్రశ్నించారు.

ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి అనుబంధంగా పనిచేసే కొంతమంది జర్నలిస్టుల చేత, రెడ్డి జాగృతి లాంటి దళిత జాతి విచ్ఛిన్నకర శక్తులతో ప్రెస్ మీట్ లు పెట్టించి వర్గీకరణకు అన్ని వర్గాలు అనుకూలంగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అబద్దాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఎంపీరికల్ డేటా కేంద్ర ప్రభుత్వం సెన్సుస్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసిన తదుపరి మాత్రమే వర్గీకరణపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. లేనిచో పక్షంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు వెంకటేష్, గోపతి రమేష్, శ్రీనివాస్, సుధీర్, భాను, మారుతి, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.