calender_icon.png 26 December, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యర్ డబుల్ సెంచరీ

08-11-2024 01:18:39 AM

ముంబై: ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ బాదాడు. 228 బంతుల్లోనే 233 పరుగులు బాదాడు. దీంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 602 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ (100) సెంచరీతో చెలరేగి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో హర్యానా ఓటమి దిశగా పయనిస్తోంది. 243 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉం చింది. బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (50 నాటౌట్) అజేయంగా నిలిచాడు.