calender_icon.png 4 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకటి కార్తీక్ ను సన్మానించిన ఐవైసి అధ్యక్షులు ఈశ్వర్ బృందం...

03-03-2025 10:54:04 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ను లక్ష్మిదేవిపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, జల్లారపు ఈశ్వర్ ఆధ్వర్యంలో యువత మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర ఐవైసి అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సారథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు లాగా పనిచేయాలని చెప్పారు. జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ అధ్యక్షతన మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జల్లారపు ఈశ్వర్ అన్నారు. ఆయన వెంట జల్లారపు నిరంజన్, నవీన్ కృష్ణ, శేఖర్, శివ, రవి, ఈశ్వర్, గణేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.