calender_icon.png 4 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి దేవి పూజకు వేళాయే

02-01-2025 12:02:15 AM

  1. నేటి నుంచి జంగుబాయి జాతర 
  2. ఆదివాసీల సంప్రదాయానికి ప్రతీకగా పుణ్యక్షేత్రం
  3. వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): అడవితోనే తమ బంధాన్ని ముడివేసుకోని జీవిస్తున్న ఆదివాసీలకు ప్రకృతితో విడదీయలేని అనుబంధం నెలకొంది. ప్రకృతినే దైవంగా భావించే ఆది  పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని దర్శంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

నేటి నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరండోలి గ్రామంలో జంగుబాయి ఉత్స  ప్రారంభంకానున్నాయి. నెల రోజులపాటు అమ్మవారిని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోనున్నారు.

వణికించే చలిలోనూ గిరిజనం వెనకాడక కాలినడకతో తమ ఆరాధ్య దేవతకు మొక్కులు తీర్చుకునేందుకు తండోప  తరలివస్తుం  డోలు, తుడం, సన్నాయి, కాలీకోం వాయద్యాల మోతతో ఆ ప్రాంతం నెల రోజుల పాటు మారుమ్రోగుతుంది. నియమ నిష్టాలతో, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల మ  అమ్మవారికి పూజలు చేస్తారు. 

వేల ఏండ్ల చరిత్ర

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కెరమెరి మండలంలోని మహరాజ్‌గూడ సమీపంలో సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో జంగుబాయి అమ్మవారు కొలువుదీరింది. వేల ఏండ్ల చరిత్ర కల్గిన పుణ్యక్షేత్రంలో ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. జాతరకు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివస్తుంటారు. ఆదివాసీ రైతులు పండించిన వడ్లను, దంచిన బియ్యం సేకరిస్తారు.

గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వుల నూనెతో నైవేద్యం తయారు చేస్తారు. దీపారాధకు నువ్వుల నూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరిగాయ, అగరవత్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ, గులాలు, వంట సామగ్రి పెట్టుకొని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు.

అమ్మవారి దర్శనం అనంతరం అక్కడే ఉన్న పోచమ్మ, మైసమ్మ, రావుడ్మ వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి అమ్మవారి పాటలు పాడుతూ ఆరాధిస్తారు. మొక్కలు చెల్లించి ఇంటికి వెళ్లిన వారికి ఆడ పడుచులు ఎదురుపడి దుస్తులను పరుస్తే కానుకలు సమర్పిస్తూ దాటుతుంటారు.

దీపమే ప్రత్యేకత

ఆదివాసీలలోని ఎనిమిది గోత్రాల కటోదాల అధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక దీపం పెట్టి ఉత్సవాలను ప్రారంభిస్తారు. కొడప, సలాం, తుమ్రం, రాయిసిడాం, హెర్రెకుమ్ర, మరప, వెట్టి, మందడి గోత్రాల కటోడాలు (పూజరులు) కాలికనడకన పూజ సామగ్రి తీసుకెళ్లి రాత్రి దీపం పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఉత్సవాలు ముగిసే  ఆదివాసీలు చెప్పులు వేసుకో  ఉంటారు. నేలపై పడుకోవడంతో పాటు మద్యం ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటారు.