22-04-2025 01:44:40 AM
నిజామాబాద్ , ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): వసంత కాలంలో వివిధ ఋతువులు ఉన్నట్లు న్యాయవ్యవస్థలో ఏప్రిల్ నెలలో బదిలీల కాలం ఉంటుందని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి కనక దుర్గ తెలిపారు. నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు హైదరాబాద్ కు బదిలీ అయిన నేపథ్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్షా,చలి,వేసవి రుతువులు వచ్చినట్లు న్యాయమూర్తులకు బదిలీల కాలం వస్తుందని అది ఎప్రిల్ నేలలోనేని ఆమె చమత్క రించారు.
కాలబార్ సమావేశపు హల్ ఎదరో నాయమూర్తులకు వీడ్కోలు పలికిన సమావేశ ‘మందిరమని‘ఆమె అభివర్ణించారు.బార్ అండ్ బెంచ్ అనే వ్యవస్థలు ఒకటేనని వేరుగా చూడలే మని అన్నారు. శ్రీకాంత్ బాబు ను న్యాయవాదులందరు స్వంత ‘బాబులాగే‘ ఆదరించి కోర్టు విధులు సాఫీగా సాగడానికి సహకరించారని జడ్జి కనక దుర్గ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జడ్జి శ్రీకాంత్ బాబు కోర్టు విధులలో అందరిని కలువుకుని పోయిన వ్యక్తి అని అన్నారు.
బార్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు ల ఆధ్వర్యంలో బదిలీపై వెళుతున్న జడ్జి శ్రీకాంత్ బాబు ను శాలువ, మెమోంటోతో ఘనంగా వీడ్కోలు పలికారు. బార్ అండ్ బెంచ్ ల గౌరవప్రతిష్టత లను కాపాడటంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నదని వారు వెల్లడించారు. వీడ్కోలు కార్యక్ర మంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్,సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, కార్యవర్గ సభ్యులు అరేటి నారాయణ, సుజిత్ ,న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు