30-04-2025 12:08:44 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): వేసవికాలంలో వ్యవసాయ పనులు లేని రోజుల్లో గిరిజనులకు ఆదాయాన్ని సమకూర్చే తునికాకు సేకరణకు వేళయింది. ప్రతి ఏటా మే 1 తేదీ నుంచి 31వ తేదీ వరకు 30 రోజులపాటు గిరిజనులకు చేతినిండా పని ఉండి ఆదాయాన్ని సమకూర్చు పంటగా తునికాకు సేకరణను వ్యవహరిస్తుంటారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 డివిజన్ లు, 163 కల్లాల ద్వారా 35,100 స్టాండర్డ్ బ్యాగులు సేకరించాలని లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. తునికాకు సేకరణకు అటవీశాఖ అధికారులు ఓపెన్ టెండర్ను ప్రైవేటు కాంట్రాక్టర్లు తునికాకు సేకరణకు అటవీ శాఖ నిర్ధారించిన డిపాజిట్ సొమ్ము ను చెల్లించి, ఆకు సేకరణ కార్యక్రమాలను తుని కాకు సేకరణను అటవీశాఖ అధికారులు అనునిత్యం పర్యవేక్షిస్తుంటారు.
గిరిజ నులు సేకరించిన తునికాకు 50 ఆకుల కట్టకు రూ 3గా ప్రభుత్వం ధర నిర్ణయించిం ది. జిల్లాలోని గిరిజన పల్లెలు ఈ నెల రోజుల పాటు తెలతెలవారుతుండగానే అటవీ మార్గంలో ప్రయాణించి తుని కాకు ను సేకరిస్తారు. సేకరించిన తునికాకును మధ్యాహ్నం సమయంలో ఇంటివద్ద 50 ఆకులను ఒక కట్టగా కట్టి, సాయంత్రం సమయంలో అటవీ శాఖ అధికారులు నిర్దేశించి న కలాల వద్ద కొనుగోలు చేస్తుంటారు.
ఇలా కొనుగోలు చేసిన తునికాకును ఎండలో బాగా ఆరిన తర్వాత బస్తాలల్లో నింపి వర్షానికి తడవకుండా భద్రపరుస్తుంటారు. జిల్లా లో ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. మణుగూరు డివిజన్లో బూ ర్గంపాడు, బయ్యారం ,కరకగూడెం ఏ, కరక గూడెం బి ,మణుగూరు యూనిట్లను ఏర్పాటు చేసి 5400 ఎస్ బి సేకరించాలని లక్ష్యాన్ని నిర్ధారించారు.
పాల్వంచ డివిజన్లో గుండాలపాడు, నాగుపల్లి, ములకలపల్లి ,పాల్వంచ యూనిట్లలో 2300 ఎస్ బి లు, ఇల్లందు డివిజన్లో గుండాల, కోనేరు గూ డెం, సాయనపల్లి, కాచినపల్లి కొమరారం, శెట్టిపల్లి, ధనియాలపాడు, సుదిమల్ల యూ నిట్ ల ద్వారా 10 600 ఎస్.బిలు.
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజన్ లో యానంబైల్ ఏ, యానంబైల్ బి, యా నంబైల్ సి, యానంబైల్ డీ పాల్వంచ ఏ యూనిట్ల ద్వారా 3200 ఎస్ బీ లు, భద్రాచలం డివిజన్లో ఆర్లగూడెం, కొమ్మనపల్లి, చర్ల, దేవరపల్లి ,దుమ్ముగూడెం యూనిట్ల ద్వారా 9700 ఎస్ బి లు,కొత్తగూడెం డివిజన్లోని గంగారం, చాతకొండ,కనకగిరి, రామ వరం డివిజన్ యూనిట్ల ద్వారా 3900 స్టాండర్డ్ బ్యాగులు కొనాలనే లక్ష్యంగా అటవీ శాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది.
గత ఏడాది జిల్లాలో మొత్తం 32,300 ఎస్ బి లకు గాను 9,700 ఎస్ బి ల తునికాకు మా త్రమే సేకరించడం జరిగింది.మందగించి పోతున్న తునికాకు సేకరణ ప్రభుత్వానికి, అటవిశాఖకు ఆదాయాన్ని సమకూర్చే తునికాకు సేకరణ రాను రాను కనుమరుగౌ తోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏడాది కేడాది తునికాకు సేకరణ పై గిరిజనులకు ఆసక్తి తగ్గుతుంది.
ధీనికి తోడు అడవుల విస్తీర్ణము అంతరించిపోవడం, పోడు భూము ల్లో పత్తి సాగు విపరీతంగా నిర్వహించడం, అకాల వర్షాలు తదితర కారణాలతో తొలికాకు సేకరణ మందగించిపోతుంది. అందు కు గత ఏడాది తునికాకు సేకరణ నిదర్శనం. కేవలం 30% తనికాకు సేకరణ మాత్రమే జరగడం చక్కని నిదర్శనం.