calender_icon.png 11 October, 2024 | 9:54 AM

రంజీ సమరానికి వేళాయే

11-10-2024 01:27:30 AM

న్యూఢిల్లీ: దేశవాలీ ప్రతిష్ఠాత్మక టోర్నీ  రంజీ ట్రోఫీకి తెరలేవనుంది. 2024-25 సీజన్ 90వ ఎడిషన్ రంజీ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి-26 వరకు పోటీలు జరగనున్నాయి. 32 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి నాకౌట్ మ్యాచులు మొదలుకానున్నాయి. సీనియర్ ప్లేయర్లు రహనే, పుజారాతో పాటు ఇషాన్ కిషన్, అయ్యర్, మరికొంత మంది మీద ప్రత్యేక దృష్టి ఉంది.

రంజీ ట్రోఫీ ప్రదర్శనపైనే జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశముందని బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ టోర్నీ మరోసారి కీలకం కానుంది. 1935 వరకు ఈ టోర్నీకి ‘క్రికెట్ చాంపియన్‌షిప్ ఆఫ్ ఇండియా’ అని పేరు ఉండేది. కానీ ఆ తర్వాత భారత్ తరఫున మొట్టమొదట క్రికెట్ ఆడిన రంజిత్‌సిన్హ్‌జీ పేరు మీద ‘రంజీ’ అనే పేరు పెట్టారు. ఇక రంజీ ట్రోఫీని ముంబై అత్యధికంగా 42 సార్లు ముద్దాడింది.