చూస్కుందామా..
- నేడో, రేపో నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న బీసీ డెడికేషన్ కమిషన్
- ఆ తర్వాత నోటిఫికేషన్!
- మార్చి రెండోవారం నాటికి ప్రక్రియ పూర్తి?
హైదరాబాద్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. సోమవారం తమ రిపోర్టును రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి అందజేయగా.. నేడో, రేపో హైకోర్టుకు సమ ర్పించేందుకు సిద్ధమైంది.
కమిషన్ తన నివేదికను హైకోర్టుకు అందజేసిన తర్వాత.. పంచాయతీ ఎన్నికల ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నాలుగో తేదీన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పా టు చేసింది.
ఈ క్రమంలో బీసీ సంఘాల నుంచి వినతులు, బహిరంగ విచారణ, కులగణన రిపోర్టుతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి గణాంకాలను క్రోడీకరించిన కమిషన్.. నివేదికను సిద్ధంచేసింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ, నోటిఫిషన్‌ను జారీచేయనుంది.
మూడోవారంలో షెడ్యూల్..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 50శాతం మించకుండా డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టులో రిజర్వేషన్లను సిఫార్సు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ నివేదికలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఏమై నా న్యాయపరమైన చిక్కులు ఉన్నా.. వాటిని సవరించుకొని ఫిబ్రవరి మూడో వారంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చేనెల 21వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. అంటే మే వరకు టీచర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో సిబ్బంది కొర త ఏర్పడుతుంది కాబట్టి.. 10 పరీక్షల ముం దే ఎన్నికలను ముంగిచాలని ప్రభు త్వం భావిస్తోంది. అందుకే మార్చి పదో తేదీలోపు ఎన్నికలను ముగించి.. ఆ తర్వాత పదో తరగతి పరీక్షలను నిర్వహించాలనుకుంటోంది.
ఇదే మంచి తరుణం..
ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వ్యవస్థాపరమైన కారణాలతో పాటు రాజకీయ కారణం కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలుగా రైతుభరోసాను విడుదల చేసింది. రైతులకు నేరుగా లబ్ధి జరిగింది. ఖాతాలో నగ దు జమతో రైతులు సంతోషంగా ఉన్నట్లు సర్కారు భావిస్తోంది.
ఇప్పుడు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. రైతు భరోసా అంశాన్ని ఎన్నికల్లో అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోని రైతు కుటుంబాలను ఆకర్షించేందుకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దోహదపడుతాయని సర్కారు భావిస్తోంది. అందుకే ఇంతకన్న మంచితరుణం ఉండబోదనేది సర్కారు యోచన.
ఆరు విభాగాలుగా రిజర్వేషన్లు..
రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ తన 700 పేజీల రిపోర్టులో పాత రిజర్వేషన్లనే సిఫా ర్సు చేసింది. ఆరు రకాలుగా రిజర్వేషన్లను విభజించింది. వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీచైర్మన్ విభాగాల్లో కమిషన్ రిజర్వేషన్లను సూచించింది.
ఈ ఆరు విభాగాల్లో కలిపి.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 10శాతం పోనూ మిగతా 23శాతం రిజర్వేషన్లను బీసీలకు సిఫార్సు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో బీసీలు 56శాతం ఉన్నారని ఇటీవల కులగణన సర్వే నివేదిక చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో తాము బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డొస్తున్నాయి. బీసీలకు 42 శాతం అమలు చేస్తే.. రిజర్వేషన్లు 50 శాతం పరిధి ని దాటిపోతాయి. అందుకే 42శాతం అ మలు చేయడం అనేది ప్రభుత్వానికి న్యా యపరంగా ఈ ఎన్నికల్లో సాధ్యం కాదు. అందుకే పార్టీ పరంగా 42శాతం అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇలాచేయ డం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు ఉంటుంది. ఇప్పటికే రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసినందున ఆ అంశం సెంట్రల్ పరిధిలోకి వెళ్లింది. దీని ద్వారా బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహాంతో సర్కారు ముందుకు వెళ్తోంది. బీఆర్‌ఎస్ కూడా అనివార్యంగా అమలుచేయాల్సి ఉం టు ంది. తద్వారా తమ వల్లే ఈ రిజర్వేషన్లు అమలు అయినట్లు ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోం ది.