calender_icon.png 13 January, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కైట్ ఫెస్టివల్‌కు వేళాయే..

13-01-2025 02:41:58 AM

  1. నేడు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి జూపల్లి
  2. ఏర్పాట్లను పరిశీలంచిన టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ 

హైదరాబాద్, జనవరి 12(విజయక్రాంతి): రంగురంగుల గాలిపటాలు సందడి చేసే ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్స్ సో మవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు పర్యాట క, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రారంభించనున్నారు.

ఈనెల 15వర కు జరగనున్న ఫెస్టివల్స్‌లో వివిధ రాష్ట్రాల్లోని కైట్ ఫ్లయర్లు పాల్గొనబోతున్నారు. ఈ వేడుకలకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్స్‌లో భాగంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంద్రదాయ వంటలు, స్వీట్స్‌ను ప్రదర్శించనున్నారు.

సమన్వయంతో పని చేయాలి: పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్ విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయా లని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. ఆదివారం ఆమె సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో వీక్షకులు వచ్చే అవకాశం ఉందని, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

మూడు రోజలు పాటు జరగనున్న ఈ వేడుకల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ (9948139909) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్నిచోట్ల తాగునీరు, ఫైర్ ఇంజిన్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పర్యాటక శాఖ సంచాలకుడు జెడ్ హనుమంతు, డీసీపీ రష్మీ పరిమల్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.