ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) మూడో సీజన్ కోసం వేలం తేదీని నిర్ణయించారు. డిసెంబర్ 15వ తేదీన వేలం ప్రక్రియ ఉంటుందని డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. డబ్ల్యూపీఎల్‌లో మొత్తం 5 జట్లు ఉండగా.. ఆ జట్లు ఇప్పటికే తమకు కావాల్సిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుని.. మిగతావారిని వదిలేశాయి.
మరి ఈ వేలంలో ఎవరు అత్యధిక ధరకు అమ్ముడు పోతారో.. స్టార్ క్రికెటర్లను ఆయా ప్రాచైజీలు అట్టే అట్టిపెట్టుకున్నాయి. గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 4.4 కోట్లు, యూపీ వారియర్జ్ రూ. 3.9 కోట్లు, ఆర్సీబీ రూ. 3.25 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 2.65 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.5 కోట్ల పర్స్ వాల్యూను కలిగి ఉన్నాయి. ఈ వేలానికి 91 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.