calender_icon.png 19 January, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక టీ20ల వంతు!

05-07-2024 02:00:39 AM

  • నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20
  • రాత్రి 7 నుంచి

చెన్నై: స్వదేశంలో దక్షిణాఫ్రికాను వన్డే, టెస్టు సిరీస్‌ల్లో మట్టికరిపించిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా నేడు సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు మన అమ్మాయిలు సిద్ధమయ్యారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న సందర్భంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాను చిత్తు చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు ఇదే చివరి వైట్‌బాల్ సిరీస్ టోర్నీ కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించిన హర్మన్ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

వన్డే సిరీస్‌లో ఆడిన జట్టే ఇక్కడా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మలు సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జేమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆశా శోభన, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయాం క పాటిల్, రేణుకా సింగ్‌లతో బౌలింగ్ బలంగా ఉంది. మరోవైపు వన్డే సిరీస్‌తో పాటు ఏకై క టెస్టు మ్యాచ్ ఓడిన సౌతాఫ్రికా కనీసం టీ20 సిరీస్‌నైనా గెలవాలని భావిస్తోంది. కెప్టెన్ లారా వోల్వర్ట్ జట్టుకు పెద్ద బలం. సీనియర్లు మా రినే కాప్, సునే లు స్, అన్నెకె బోస్క్, తంజిమ్ బ్రిట్స్ లపై జట్టు ప్రదర్శన ఆధా రపడి ఉంది. బౌలింగ్‌లో లాబా, క్లాస్, క్లెర్క్‌లు కీలకం కానున్నారు.