calender_icon.png 17 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీత రాకకు వేళాయే

17-03-2025 12:24:57 AM

  1. ఐఎస్‌ఎస్‌తో క్రూబె మిషన్ అనుసంధానం సక్సెస్
  2. ప్రకటన విడుదల చేసిన నాసా, స్పేస్‌ఎక్స్

న్యూఢిల్లీ, మార్చి 16: స్పేస్‌ఎక్స్, అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) సంయుక్తంగా ప్రయోగించిన క్రూ మిషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)తో విజ యవంతంగా అనుసంధానమైంది. దీంతో దాదాపు 9 నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియ మ్స్, బుచ్ విల్మర్‌లు మరికొద్ది రోజుల్లో భూమ్మీదకు తిరిగిరానున్నారు.

తాము ప్రయోగించిన క్రూ మిషన్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:40 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైనట్టు నాసా ప్రకటించింది. ఈ క్రమంలోనే అనుసంధానాన్ని ధ్రువీకరిస్తూ స్పెస్‌ఎక్స్ ఎక్స్ ఖాతా ద్వారా వీడియోను విడుదల చేసింది.

క్రూ మిషన్ ద్వారా ఐఎసెఎస్‌కు వెళ్లిన నలుగురు వ్యోమగాములకు అక్కడ ఉన్న సునీతా విలియమస్, బుచ్ విల్మర్‌లతోపాటు ఇతర సిబ్బంది స్వాగతం పలికిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అనుసంధాన ప్రక్రియ విజయవంతం కావడంతో సునీత, విల్మర్‌లు ఈ నెల 19న భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది.