- వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వివాహం
- ఈ నెల 22న ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేడుక
- 24న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో కలిసి సింధూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. వీరి వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. ఈ నెల 20 నుంచే వీరి పెళ్లి వేడుక షురూ కానుంది.
ఇక స్వస్థలం హైదరాబాద్‌లో డిసెంబర్ 24న సింధూ, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇటీవలే స్వదేశంలో జరిగిన సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఒక్క టోర్నీ కూడా గెలవని సింధూ ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. అయితే సింధూకు సయ్యద్ మోదీ టైటిల్ గెలవడం కాస్త ఊరట కలిగించింది.
ఎవరీ వెంకట దత్త సాయి?
పీవీ సింధు వివాహం చేసుకోనున్న వెంకటదత్త సాయి వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయి లిబ రల్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్లేమ్ యునివర్సిటీ నుంచి 2018లో బీబీఏ పట్టా అందుకున్నాడు. ఆయనకు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంచి సంబంధముంది. పోసిడెక్స్‌కు ముందు ఢిల్లీ క్యాపి టల్స్ యాజమాన్యం జేఎస్‌డబ్ల్యూలోనే ఆయన కెరీర్ ప్రారంభమయింది.
ఇంటర్న్‌గా మొదలుపెట్టిన వెంకట దత్త ఆ తర్వాత హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ‘ఇరు కుటుంబాలకు ఎప్పట్నుంచో పరిచయముంది. గత నెలలోనే వీరి వివాహం జరగా ల్సింది. కానీ సింధూ బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి వేడుకను డిసెంబర్‌కు వాయిదా వేశాం’ అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక సింధూ 2016, 2020 ఒలింపిక్స్‌లో రజ త, కాంస్యాలు సాధించి రికార్డు నెలకొల్పింది. 2017లో వరల్డ్ ర్యాం కింగ్స్‌లో తొలిసారి ప్రపం చ రెండో ర్యాంక్ అందుకుంది.