calender_icon.png 13 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైరెక్టర్ల వంతు!

12-03-2025 12:45:25 AM

  1. శ్రీచైతన్యపై దేశవ్యాప్తంగా రెండో రోజూ కొనసాగిన సోదాలు
  2. రూ.5 కోట్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం! 

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తం గా రెండో రోజూ ఐటీ సోదాలు జరిగాయి. విద్యాసంస్థల డైరెక్టర్ల ఇండ్లల్లో సోదాలు చేపట్టినట్లుగా సమాచారం. మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థల కార్యాలయం లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెం ట్స్ ఆధారంగా అదేప్రాంతంలో విల్లాలో ఉండే ఓ డైరెక్టర్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

అదేవిధంగా అటు ఖమ్మంలో ఉన్న మరో డైరెక్టర్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముం బై, బెంగళూరు, చెన్నై నగరాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాధిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు తేల్చినట్లు సమాచారం. రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాలేజీలతోపాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. లావాదేవీలకు  సంబంధించిన సాఫ్ట్ వేర్‌ను పరిశీలించినట్లు తెలిసింది.