calender_icon.png 26 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న వయస్సులో మృతి చెందడం భాదాకరం

24-03-2025 12:57:35 AM

తలకొండపల్లి, మార్చి 23 (విజయక్రాంతి): కుటుంబ పోషణలో భర్తకు చేదోడుగా ఉంటూ అన్ని తానై చూసే భార్య చిన్న వయస్సులో ఆకాల మృతి చెందడం ఆకుటుంబానికి తీరనిలోటని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన గార్లపాటి సరిత వెంకట్రావుపేట బిఆర్‌ఎస్ ఎంపిటిసిగా వ్యవహరించారు.శుక్రవారం అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ  చికిత్స పొందుతూ పరిస్తితి విషమించి శనివారం అర్థరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృత దేహాన్ని స్వగ్రామం ఖానాపూర్ కు తరలించారు. విషయం తేలిసిన ఖానాపూర్ గ్రామానికే చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకుని మృత దేహాన్ని సందర్శించి నివాలులర్పించారు. మృతురాలు ప్రజా ప్రతినిది కావడంతో తలకొండపల్లి మండలం,కల్వకుర్తి నియొజవర్గంలోని వివిద పార్టీల నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తరలివచ్చి సరిత మృతదేహానికి నివాలులర్పించారు.