22-04-2025 02:06:24 AM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేక పో యినా బీజేపీ పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో బీజేపీ భాగ్యనగరంలో మత విద్వేషాలు పెంచుతోందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు కేంద్రానికి పంపితే బీజేపీ నేతలు ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ప్రస్తు తం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీకు ఓటు వేస్తారో లేదో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.