నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, పర్యవేక్షించిన అధికారులను నాన్‌బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేస్తామని ఇటీవల సాక్షాత్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇన్నాళ్లు తమలపాకు మందం తారు రోడ్లు, సిమెంటే లేకుండా సీసీ రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, ఆమ్యామ్యాలు అందుకొని కాంట్రాక్టర్లకు వంత పాడిన అధికారులు వణికిపోతున్నారు. రోడ్లు వేసేటప్పుడే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదీ ఏమైనా అవినీతికి పాల్పడిన వారి భరతం పట్టాల్సిందేనంటూ కేంద్రమంత్రి నిర్ణయానికి వంతపాడుతున్నారు.
పెద్ది విజయభాస్కర్