calender_icon.png 29 October, 2024 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు..

29-10-2024 02:20:54 AM

కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు కాం గ్రెస్ ప్రజాపాలన ఉందని, అక్రమార్కులు, కాంగ్రెస్ గ్యాంగ్‌లు చెట్టాపట్టాలేసుకొని సహజవనరులను కొల్లగొడుతున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారక రామారావు విమర్శించారు

. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని యథేచ్చగా ఇసుకను మట్టిని బుక్కేస్తున్నారని మండిపడ్డారు. సంపద పెంచే ఆలోచనలు బీఆర్‌ఎస్ పాలకులవి అయితే, ఉన్నది ఊడ్చే తెలివితేటలు కాంగ్రెస్ నా యకులవని 

ఎద్దేవా చేశారు. హైడ్రా దెబ్బకు హైదారాబాద్‌లో పేదల సొంతింటి కలలు కలగానే మిగిలిపోయిందన్నారు. కొ నుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా, ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందలేదని,  ప్రభుత్వానికి రైతుల గోస పట్టలేదన్నారు. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.