calender_icon.png 21 April, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగు ముందుకు పడట్లే!

14-03-2025 12:00:00 AM

  1. సాంకేతిక సమస్యతో ముందుకు సాగని హైడ్రాలిక్ పవర్డ్ రోబో 
  2. ప్రమాదకర ప్రదేశానికి జంకుతున్న రెస్క్యూ బృందాలు 

నాగర్‌కర్నూల్, మర్చి 13 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు సొరంగమార్గం కూలి 20 రోజులు గడుస్తున్నా కార్మికుల జా డ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. 14 రెస్క్యూ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నా 8 మంది కార్మికుల్లో ఒక్కరినే గుర్తించారు. మిగతా 7గురి కోసం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

టన్నెల్‌లోని 13.6 కిలోమీటర్ వద్ద భారీగా నీటిఊటతో పాటు బురద మట్టి పేరుకుపోవడంతో ఆ ప్రదేశంలో సహాయక చర్యల కోసం తవ్వకాలు జరిపే క్రమం లో ప్రాణనష్టం వాటిల్లే ఆస్కారం ఉందని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ కలిగిన రో బో యంత్రాలను రంగంలోకి దించింది.

బుధవారం ఈ హైడ్రాలిక్ పవర్ రోబో సొరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం అన్వి రోబో నిపుణుల బృందం పూర్తిస్థాయిలో శ్రమించినా సాంకేతిక కారణాల వల్ల రోబో అడుగు ముందుకు వేయలేకపోయింది. ఎన్జీఆర్‌ఐ నిపుణులు జీపీఆర్ రాడార్, కేరళ కడావర్ జాగిలాలు గుర్తించిన డీ 2 ప్రదేశంలో తవ్వకాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

బీటు ప్రాంతం నుంచి డీ వన్ ప్రాంతం మధ్యలో సుమారు 20 మీటర్ల పొడవునా 6 నుంచి 8 మీటర్ల వరకు కాంక్రీట్‌తో కూడిన మట్టి బురదను తవ్వి బయటకు తీశారు. గురువారం మరోసారి కేరళ ఎడాబర్ డాగ్స్‌తో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టినా ఫలితం కనిపించలేదు. మరోవైపు డీ ప్రదేశంలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తవ్వకాలు జరిపే కొద్దీ నీటి ఊట భారీగా పెరుగుతోందని టీబీఎం యంత్రం కటింగ్ చేసే క్రమంలోనూ నీటి ఊట తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష  నిర్వహించారు.